ఎమ్మెల్యే స్వంత నిధులతో నూతన గేట్లు ఏర్పాటు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని సంగెం గ్రామంలో భీమ లింగం కత్వా గేట్లు శిధిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో మూడు నూతన గేట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ గేట్లు వేయడం వలన గ్రామ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love