నవతెలంగాణ ఎఫెక్ట్.. బెట్టేల తండాకు నూతన పైపు లైన్ ఏర్పాటు

– స్పందించిన మిషన్ భగీరథ ఏఈ
– రెండు రోజుల్లో తాగునీళ్లు
నవతెలంగాణ – పెద్దవూర
ఈ నెల 22 న నవతెలంగాణ లో బెట్టేల తండాలో ఇంటింటికి రాని భగీరద నీళ్లు,రెండు నెల్లుగా ట్యాంక్ వద్దనే మిషన్ భగీరథ నీళ్లు,తాగు నీళ్ల కోసం మహిళలు సిగపట్లు, మిషన్ భగీరథ ట్యాంక్  నిండక తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు అనే కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. గత మూడు రోజుల నుంచి బెట్టేల తండాకు వచ్చే పైపు లైన్ వెంట వున్న గ్రామాలలోని ట్యాంక్ లను పరిశీలించగా మండలంలోని ఊరబావి తాండ జంక్షన్ వద్ద పైపు వంగిపోయి ఉండడంతో బట్టేలా తండాకు నీళ్లు రాడం లేదని మిషన్ భగీరథ ఏఈ పంకజ్ కుమార్ శనివారం నవతెలంగాణ తో ఫోన్లో మాట్లాడారు. జంక్షన్ వద్దు నుంచి నూతనంగా పైవు లైన్ వేస్తున్నామని తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా నూతన పైపు లైన్ వేస్తున్నారు. రెండు రోజుల్లో బెట్టేల తండా కు పూర్తి స్థాయిలో తాగునీటిని అదిస్తున్నట్లు నవతెలంగాణ తో తెలిపారు. నవతెలంగాణ లో వార్త వచ్చినప్పటీ నుంచి నాలుగు రోజులు పైపు లైన్ పరిశీలించగా రెండు రోజుల క్రితం ఊరబావి తండా జంక్షన్ వద్ద పైపు డామేజ్ అయినట్లు తెలిసిందని అన్నారు. వెంటనే నూతన పైపు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Spread the love