మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

– వనదేవతలను దర్శించుకున్న నిమ్స్ ఉద్యోగులు

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలో మహా జాతర ముగిసిన భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఫిబ్రవరి 21 22 23 24 తేదీలలో మహా జాతర నిర్వహించారు. 28వ తారీకు తిరుగు వారం. నేడు మూడో తారీకు ఆదివారం కూడా భక్తులకు తండోప తండలుగా కదిలి వచ్చారు. ఆదివారం మేడారం ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటికీలాడిపోయింది. ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయి. భక్తులు మొదట జంపన్న వాగులో వితలంటు స్థానాల ఆచరించి కళ్యాణకట్టలో పుట్టేంట్రుకలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వరదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. సెలవు దినం కావడంతో వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందాలు కూడా వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు.
ఉన్న దేవతలను దర్శించుకున్న నిమ్స్ హాస్పటల్ ఉద్యోగులు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పంజాగుట్ట లోగల నిమ్స్ హాస్పిటల్ ఉద్యోగులు సత్తీష్, శ్రీను, విశ్వాస్, వైద్య సిబ్బంది ఆదివారం వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతల దర్శించుకున్న అనంతరం అడవి ప్రాంతంలో వంట వార్పు ఏర్పాటు చేసుకుని సాహసం భోజనాలు నిర్వహించారు.
Spread the love