Friday, June 5, 2026
E-PAPER
Homeబీజినెస్ఒకే ప్రమాణంలో వంటనూనెల ప్యాక్‌‌లు..!

ఒకే ప్రమాణంలో వంటనూనెల ప్యాక్‌‌లు..!

- Advertisement -

వంటనూనెల ప్యాక్ సైజులను ప్రామాణీకరించాలని కేంద్రం యోచిస్తోందని సమా చారం. కచ్చిత పరిమాణాల్లో మాత్రమే విక్రయిండం ద్వారా వినియోగదారులకు ధరల పారదర్శకత లభించనుందని భావిస్తోంది. ఇది తయారీ దారులకు మరింత సమానమైన పోటీ వాతావరణాన్ని సృష్టి స్తుందని పరిశ్రమ వర్గాలు చెబు తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 850 మిల్లీలీటర్లు, 875 మి.లీ, 900 మి.లీ, 950 మి.లీ వంటి ప్రమాణరహిత (నాన్-స్టాండర్డ్) ప్యాక్ సైజుల ప్రాచుర్యం పెరుగుతోంది. దీనివల్ల వినియోగదారులు వివిధ బ్రాండ్ల మధ్య ధరలను పోల్చడం, లీటరు ప్రాతిపదికన ఉత్పత్తి, అసలు ధరను అంచనా వేయడం కష్టంగా మారుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదిత చర్య ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -