
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ యాక్ట్ అమలు చేసేందుకు పాలకవర్గం సహకరించాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వర్షాల నేపథ్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రంజిత మాట్లాడుతూ పట్టణంలో ఓపెన్ ప్లాట్లు యజమానులకు నోటీసులు జారీ, ఓపెన్ ప్లాట్ ప్లాట్లను చదును చేసుకోకపోతే వారిపై మున్సిపల్ యాక్ట్, నూతనంగా నిర్మిస్తున్న భవనాలు, పాత భవనాలు డ్రైనేజీ పై వరకు నిర్మాణం సెట్ బ్యాక్ చేయడంపై వివరించారు. వర్షాలు పడటం వల్ల నీటి నిల్వలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌన్సిల్ సమావేశంలో తెలిపారు. అందరూ సహకారంతో పట్టణంలో మున్సిపల్ యాక్ట్ అమలు చేసి సమస్య లేకుండా చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ , వైస్ చైర్ చైర్మన్ అనిత, కౌన్సిలర్స్ బొజు రమాదేవి, కోమటి స్వర్ణలత, చిత్తరి పద్మ, మ్యాదరబోయిన వేణు, ,గోవిందు రవి, దొడ్డి శ్రీనివాస్ ,బొల్లి కల్పన, భూక్యా సరోజన, వల్లపు రాజు ,బొజ్జ హరీశ్ , వాల్ల సుప్రజ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.