Saturday, August 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్హనుమాన్ ఆలయ నిర్మాణానికి ప్రపోజల్ కాపీ అందజేత

హనుమాన్ ఆలయ నిర్మాణానికి ప్రపోజల్ కాపీ అందజేత

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లోని హనుమాన్ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో శనివారం మండల నాయకులకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టెండర్ ప్రపోజల్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. దీంతో ముఖ్యంగా మండలంలోని రంగశివిని తాండ, ఫార్డి కే గ్రామమలో కల్యాణ మండపాలు, ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

నిధులు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కుభీర్ గ్రామస్తులు తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కుభీర్ సర్పంచ్ సాయినాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శంకర్ చావన్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్,మాజీ చెర్మన్ సంతోష్ నాయకులు రాజన్న, మల్లేష్ యాదవ్,జావీద్ ఖాన్, పెంటజీ,నాగలింగం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -