విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి

Cow died due to electric shockనవతెలంగాణ-నిర్మల్‌
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదవశాస్తూ విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి చెందిన సంఘటన నిర్మల్‌ రూరల్‌ మండలం అనంతపేట గ్రామంలో చోటుచేసుకుంది. యజమాని బొబ్బిలి గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న మేతకు వెళ్లిన ఆవు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతుకారు. గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫాÛర్మర్‌ వద్ద మృతి చెంది కనిపించింది. భారీ వర్షాల కారణంగా ఎర్త్‌ వైర్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో అటువైపు మేతకు వెళ్లిన పశువు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతి చెందిన ఆవు విలువ రూ.60 వేలు ఉంటుందని, పశుపోషనే ప్రధాన వృత్తిగా నమ్ముకుని తన కుటుంబం జీవనం సాగిస్తుందని తెలిపాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరాడు.

Spread the love