ఇండియా కూటమి అభ్యర్థికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు

నవతెలంగాణ – మాక్లూర్ 
రైతు వ్యతిరేక పార్టీ బిజెపి పార్టీ అభ్యర్థులను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోర్గం (కే) గ్రామంలో పత్రిక సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వము 10 సంవత్సరంలో అధికారంలో ఉండి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించిందనీ, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రైతు వ్యతిరేక మూడు  నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని బిజెపి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేసిందనీ,  రైతాంగము మూడు  నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని 14 నెలల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. ఈ పోరాట ఫలితంగా మోడీ గారు వెనక్కి వచ్చి రైతాంగానికి వ్రాతపూర్వకంగా మాట ఇచ్చి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు. కార్మిక చట్టాలను కాలరాశి 44 కార్మిక చట్టాలకు బదులు నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక రంగాన్ని మోసగించడానికి ప్రయత్నం చేసిందనీ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలకు బదులుగా 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. కావున రేపు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ సమావేశానికి జిల్లా రైతాంగం అధిక సంఖ్యలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అలాగే ఇండియా కూటమి అభ్యర్థికి సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతుని ఇస్తుందని తెలిపారు.
Spread the love