సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలి : బి.వి. రాఘవులు

 – బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకోవాలి 

 – బీజేపీపై బీఆర్ఎస్ వైఖరి ప్రకట్టించాలి 
 – ఇండియా కూటమి పార్టీలపై కాంగ్రెస్ వైఖరి సరి కాదు
 – రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో పొత్తులకు విఘాతం కల్పించింది 
 – ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది
 – శాసనసభలో వామపక్షాలు లేకపోవడం ఆందోళనకరం ప్రజా పోరాట చరిత్రను తిరగరాదం 
 – సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు 
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి:
ఈ ఎన్నికల్లో దేశానికి ప్రమాదకరమైన మతోన్మాద బీజేపీని అడ్డుకుని  సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని  సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. ఇండియా కూటమీలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందాని చెప్పారు. బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యని గెలిపించాలని కోరుతూ చేపట్టిన ప్రచారం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను గెలిపించాలంటున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత ఉంటుందని, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ ప్రకటిస్తున్నారని చెప్పారు. కానీ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన, బీజేపీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎవరికి మద్దతిస్తుందన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేయడం లేదన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీకి కూడా మద్దతు ఇస్తారని అనుకోవాలా? లేక ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా అన్నది స్పష్టత లేదన్నారు. ఆ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉందా? అనుకూలంగా ఉందా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. బీజేపీత సర్దుబాటు చేసుకునే ముందుకు పోతున్నట్లు అర్థమవు తుందన్నారు. అవసరమైతే బీజేపీకి అవకాశం లేకపోతే కాంగ్రెస్ అన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రమాదకరమైందని చెప్పారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు దేశానికి ప్రమాదకరమన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విధానాలను కాలరాస్తున్న మతోన్మాలను బీజేపీకి పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని కోరారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా వామపక్షాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఆ పార్టీ గెలువని స్థానాల్లో సైతం ఒక్క ఓటు కూడా పడకుండా వామపక్షాలు పని చేస్తున్నాయన్నారు. మరోవైపు బీజేపీ పట్ల కాంగ్రెస్ కఠినమైన వైఖరిని తీసుకోవాలన్నారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో ఏర్పడిన ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకు గురి చేస్తుందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటులో మోసం చేసిందన్నారు. ఏకపక్షంగా అభ్యర్థులను పట్టించుకున్నదని చెప్పారు. ఇదే విషయాన్ని అఖిలేష్ యాదవ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా వామపక్షాలను మోసం చేసిందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అడ్డు పుల్లలు పెడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. కీలకమైన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వైఖరి సరైనది కాదన్నారు. తెలంగాణ శాసనసభలో వామపక్షాలు లేకపోవడం ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం కాదన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ కాంగ్రెస్ గెలిచిన ప్రజలకు లాభం జరగదన్నారు. అధికారంలో ఉన్న సందర్భాల్లో ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు, అరెస్టులు, దాడులు కొనసాగాయని చెప్పారు. ఆ పార్టీలన్నీ అన్యాయాలు, అక్రమాలకు పాల్పడినవేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రతిబింబించడం లేదన్నారు. ఈ తరుణంలో వామపక్షాలు, అందులోను సీపీఐ(ఎం) ప్రాతినిధ్యం అవసరమన్నారు. రాష్ట్రంలో 19 స్థానాల్లో సీపీఐఎం, ఒక్క స్థానంలో సీపీఐ, మరికొన్ని స్థానాల్లో వామపక్ష శక్తులు పోటీ చేస్తున్నాయని ఆ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజా, భూ పోరాటాల చరిత్రను తిరగరాదామని చెప్పారు. అనేక భూ సమస్యలు వామపక్షాల సారథ్యంలోనే పరిష్కరించుకోగలిగామన్నారు. సీపీఐఎం నాయకత్వంలో బలమైన ఉద్యమాలు కొనసాగాయని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పోటీ చేస్తున్న అభ్యర్థి యాదయ్యను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు ప్రజల్లో ఆదరణ మెండుగా ఉందన్నారు. అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తద్వారా ప్రజా ఉద్యమాలకు మరింత మద్దతు ఇచ్చిన వారవుతారన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, జగదీష్ మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్,  నాయకులు రామకృష్ణారెడ్డి, ఆనంద్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.cpim-candidates-should-win
Spread the love