చికెన్ వ్యర్ధాల సేకరణకు టెండర్ పిలవాలి: సీపీఐ(ఎం)

– మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే అక్రమ సేకరణను అరికట్టాలి
నవతెలంగాణ – కరీంనగర్ 
కరీంనగర్ పట్టణంలోని చికెన్ వ్యర్ధాల సేకరణకు టెండర్ పిలవాలని, మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే విధంగా కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమ సంపాదిస్తున్నారని, మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్న అక్రమార్జనను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీసీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సీసీఐ(ఎం) నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. నగరంలోని చికెన్ సెంటర్లలో వ్యర్ధాలను మేయర్ అణువాయులు సేకరించి ఆంధ్రప్రదేశ్, ఇతర జిల్లాలకు అమ్ముకుంటున్నారని అన్నారు. కొద్దిమంది ముఠాగా ఏర్పడి కోడి కాళ్లు,తలలు ఇతర వ్యర్ధాలు సేకరించి వారానికి సుమారుగా రూ.5 నుండి 7 లక్షల రూపాయల వరకు  సంపాదిస్తున్నారని, మున్సిపల్ టెండర్ వేసి సేకరించడం ద్వారా నగరపాలక సంస్థ అభివృద్ధికి నిధులు చేకూరుస్తాయని అన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి టెండర్ నిర్వహించాలని కోరారు. అలాగే నగరంలోని పలు ఆసుపత్రులలో, చికెన్, మటన్ సెంటర్లలోని పనికిరాని వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని, దీని మూలంగా వర్షానికి తడిసి దుర్వాసన వస్తుందని, మరి కొంతమంది మున్సిపల్ చెత్త బండిలో వేస్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించి జరిమానులు విధించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, నాయకులు చెలికాని శ్రీనివాస్ అన్నారు.
Spread the love