ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు సీపీఐ(ఎం) మద్దతు

నవతెలంగాణ – మాక్లూర్ 
ఈ నెల16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ కు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ప్రకస్తిస్తుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండగంగాధర్ తెలిపారు. మంగళవారం మండలంలోని దాస్ నగర్ వద్ద బంద్ కు సంబంధించిన పోస్టుల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతుగా మండల కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బీజేపీ ప్రభుత్వాధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిందని అయినా రైతాంగ, కార్మిక ప్రజలు సమస్యల పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకిక వాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన జెండాను ముందుకు తీసుకెళ్తుందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మరల్చడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మతత శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం, అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక మతం వారు జరుపుకునే కార్యక్రమం కాకుండా ఇతరులు మనోభావాలను దెబ్బతీస్తుందని, రాజ్యాంగానికి, లౌకిక విలువలకు కలారస్తు మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలు మోడీ భజనగా మార్చేశారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ తంతు ఇలాంటి స్వార్థపూరిత ప్రయత్నాలను కార్మికులు, రైతులు, కూలీలు, సాధారణ ప్రజానీకం తిప్పికొట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాస్ నగర్ సాయిలు, బండారి ఎల్లయ్య, రాజు, మోహన్ లు పాల్గొన్నారు.
Spread the love