ఎమ్మెల్సీ సత్యం ను ఘనంగా సన్మానించిన సీపీఐ(ఎం) మండల నాయకులు

నవతెలంగాణ – మునుగోడు: నూతనంగా ఎమ్మెల్సీ ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ను గురువారం సీపీఐ(ఎం) మండల నాయకులు తమ నివాసం వద్ద ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుగా జిల్లాలో సాగునీరు తాగునీరు కోసం జరిగిన ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన నెల్లికంటి సత్యం కు ఎమ్మెల్సీ పదవి రావడంతో ప్రజా ఉద్యమకారుడుకి పట్టం కట్టడం అని అన్నారు. చట్టసభలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించేందుకు గొప్ప అవకాశం అని అన్నారు. నేటికీ నల్గొండ జిల్లాలో సాగునీరు తాగునీరు లేక వర్షాలపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాగునీటి తాగు నీటి కష్టాలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి , మండల కమిటీ సభ్యులు మీర్యల భరత్ , వరికుప్పల ముత్యాలు , యాస రాణి శ్రీను , వేముల లింగస్వామి , యాట యాదయ్య , కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య, మునుగోటి స్వామి , యాస రాణి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
Spread the love