నేడు సీపీఎం పార్టీ చౌటుప్పల్ పట్టణ విస్తృతస్థాయి సమావేశం

నవతెలంగాణ – చౌటుప్పల్
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం అదివారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగింది.ఈ సమావేశంలో సీపీఎం పార్టీ చౌటుప్పల్ పట్టణ కార్యదర్శి బండారు నరసింహ మాట్లాడుతూ తేదీ 29/1/2029 సోమవారం ఉదయము 10 గంటలకు పద్మావతి ఫంక్షన్ హాల్ లో చౌటుప్పల్ మున్సిపల్ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని , ఈ సమావేశానికి పార్టీ సభ్యులు అభిమానులు పాల్గొని, జయప్రదం చేయాలని అన్నారు.ఈ  కార్యక్రమానికి సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ గౌడ్ కౌన్సిలర్ దండ హిమబిందుఅరుణ్ కుమార్ నాయకులు ఆకుల ధర్మయ్య,బత్తుల దాసు, బావండ్లపల్లి స్వామి,ఎర్ర ఉషయ్య,చీకూరి ఈదయ్య, నెల్లికంటి నరసింహ యువజన సంఘం నాయకులు తూర్పునూరు మల్లేశం,మోగుదాల రాములు,గంజి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

Spread the love