పోలీస్ కస్టడీలో మృతి ఘటనపై క్లారిటీ ఇచ్చిన సిపి 

– గుండెపోటుతో మృతి చెందాడు 
– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటన విడుదల 
నవతెలంగాణ కంఠేశ్వర్ 

పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందిన పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే రిమాండ్ ఖైదీ ఘటనలో క్లారిటీ ఇచ్చారు. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు సీపీ పోతరాజు సాయి చైతన్య మీడియాకు వెల్లడిస్తూ శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. మీడియాకు శుక్రవారం మధ్యాహ్నం ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సంపత్ డెత్ మిస్టరీ పై క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఈ కేసులో ఆయన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. సీపీ సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం..తెలంగాణ నుంచి అమాయక గ్రామీణ యువకులను, నిరుద్యోగులను ప్రలోభపెట్టి థాయిలాండ్, మయన్మార్ లతో పాటు లావోస్ కు పంపినందుకు నిందితుడు ఆలకుంట సంపత్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సీసీపీఎస్) లో క్రైమ్ నంబర్ 10/2025 లో బీఎన్ఎస్ సెక్షన్లు 8(4), 351(2), 308(5), 127(2), 143 / 61(2), IT సెక్షన్ 66 (డి), 2000 – 2008, వలస చట్టం సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారన్నారు. తదుపరి విచారణ కోసం న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారని పేర్కొన్నారు. తరువాత మార్చి 12న సంపత్ ను పోలీసు కస్టడీకి తీసుకున్నారని వివరించారు. సీసీపీఎస్ పోలీసులు దర్యాప్తులో నిందితుడు ఆలకుంట సంపత్ తన పై నమోదైన కేసుల్లో స్వచ్ఛందంగా నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడని సీపీ తెలిపారు. జగిత్యాలలో రెండు మొబైల్ ఫోన్లను దాచిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించడంతో అతని అంగీకారంతోనే అధికారికంగా మధ్యవర్తులు / పంచుల సమక్షంలో నమోదు చేశారన్నారు. దీని ఆధారంగా, సంపత్ పోలీసులను జగిత్యాలలోని తన కార్యాలయం శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి తీసుకెళ్లాడన్నారు. అక్కడ ఆయన దాచిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. అతని అంగీకారంతోనే జగిత్యాలకు ప్రయాణమవడం, మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం, తిరిగి నిజామాబాద్ కు తిరిగి రావడం వంటి మొత్తం ప్రక్రియను పట్టపగలు బహిరంగంగా పంచుల సమక్షంలో నిర్వహించామని సీపీ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అంతటా ఇద్దరు మధ్యవర్తులు నిందితులు వీరితో పాటు సీపీపీఎస్ అధికారులున్నారని తెలిపారు. దీంతో పాటు పూర్తి పారదర్శకతతో పాటు సరైన డాక్యుమెంటేషన్ ను నిర్ధారిస్తూ వెళ్లారన్నారు. సంపత్ జగిత్యాలలో నిర్వహిస్తున్న కన్సల్టెన్సీలో మొబైల్ ఫోన్ ల స్వాధీనం ప్రక్రియలు పూర్తయిన తర్వాత నిందితుడిని ఈనెల 13 న రాత్రి 9.45 గంటలకు నిజామాబాద్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు సంపత్ ను సురక్షితంగా తిరిగి పంపించారని సీపీ పేర్కొన్నారు. అయితే ఆ రాత్రి తర్వాత, నిందితుడు అకస్మాత్తుగా తన ఎడమ చేయి లాగడం, అలసట, నొప్పి వంటి సమస్యల గురించి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఆవశ్యకతను గుర్తించిన పోలీసు సిబ్బంది వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు స్వయంగా ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లడం సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.ఆలకుంట సంపత్ సుమారు 12.29 గంటలకు నిందితుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో కుప్ప కూలిపోయాడని సీపీ తెలిపారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో చేసే సీపీఆర్ చికిత్సను కూడా అందించడానికి వైద్య బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, సంపత్ ను బ్రతికించలేకపోయారన్నారు. మరణానికి కారణం తీవ్రమైన గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారని సీపీ స్పష్టం చేశారు. ఈ సమాచారం అందిన తరువాత నిజామాబాద్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బీఎన్ఎన్ఎస్ సెక్షన్ 196 కింద క్రైమ్ నంబర్ 101/2025లో ఎస్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఈ సంఘటన తర్వాత గౌరవనీయులైన సుప్రీంకోర్టు, ఎన్ హెచ్ ఆర్ సీ, బీఎన్ఎస్ఎస్ మార్గదర్శకాలకు కట్టుబడి స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించారన్నారు. దర్యాప్తును డీఎస్పీ స్థాయి అధికారి నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ సమాచారం అందిన తరువాత నిజామాబాద్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బీఎన్ఎన్ఎస్ సెక్షన్ 196 కింద క్రైమ్ నెంబర్ 101/2025లో ఎస్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఈ సంఘటన తర్వాత సుప్రీంకోర్టు, ఎన్ హెచ్ ఆర్ సీ, బీఎన్ఎస్ఎస్ మార్గదర్శకాలకు కట్టుబడి స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించిందన్నారు. దర్యాప్తును డీఎస్పీ స్థాయి అధికారి నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఫస్ట్- క్లాస్ మెజిస్ట్రేట్ ద్వారా జ్యుడీషియల్ విచారణ…
ఈ ఘటన పై పూర్తి వివరాలను మానవ హక్కుల కమిషన్ కు కూడా సమాచారాన్ని సక్రమంగా అందజేశామని సీపీ తెలిపారు. సంపత్ మృతి ఘటన పై జ్యుడీషియల్ ఫస్ట్-క్లాస్ మెజిస్ట్రేట్ ద్వారా జ్యుడీషియల్ విచారణ జరుగుతోందన్నారు. ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులైన వైద్యుల బృందం పోస్ట్ మార్టం పరీక్ష (పీఎంఈ) ను నిర్వహిస్తుంది. ఇది పూర్తి పారదర్శకత కోసం ఆడియో – వీడియో రికార్డ్ కూడా చేస్తారన్నారు. దర్యాప్తు పూర్తిగా అత్యున్నత స్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నారని, చట్టపరమైన, విధానపరమైన అన్ని ప్రోటోకాల్ ను అనుసరిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.
Spread the love