నవతెలంగాణ – బెజ్జంకి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని మానకొండూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయి పాల్పడిన అవినీతి,అక్రమాలపై ప్రశ్నించడంవల్లే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ నాయకుడు రాసూరి మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్యేగా పనిచేసిన పదేళ్లలో అసలైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన దాఖాలాలు రసమయి బాలకిషన్,బీఆర్ఎస్ నాయకులకు లేవని మల్లికార్జున్ విమర్శించారు.పవిత్రమైన వైద్య వృత్తిలో ాగించి తోచిన విధంగా నిరుపేదలను అదూకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లేదని మల్లికార్జున్ హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని ధర్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రుణమాఫీ వర్తించిందని ఆరోపణలు చేయడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని రాసూరి ఆరోపించారు.