పంట సాగు పెట్టుబడి పెరిగింది..రుణ పరిమితి  పెంచండి: రైతులు

– మొర పెట్టుకున్న రైతులు
– వ్యవసాయ రంగానికి అండగా ఉంటాం:  యూనియన్ బ్యాంక్ డీజీఎం హనుమంత రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
సాగులో యాంత్రిక త,పంట ను ఆశిస్తున్న కొత్తరకం వ్యాధులతో  పెట్టుబడి వ్యయం పెరిగిందని అందుకు అనుగుణంగా ఆర్ధిక సంస్థలు ఋణ పరిమితి పెంపుదల చేసి రైతులను ఆర్ధికంగా చేయూతను ఇవ్వాలని యూనియన్ బ్యాంక్ డీ జీ ఎం హను మంత రెడ్డి కి పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. మంగళవారం యూనియన్ బ్యాంక్ స్థానిక బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో బ్యాంక్ డీ జీ ఎం హను మంత రెడ్డి బృందం స్థానిక రైతులు,నర్సరీ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.పామాయిల్ కు ప్రస్తుతం రూ.3 లక్షలు రుణం అందిస్తున్నారని దానిని రూ. 5 లక్షలు కు పెంపుదల చేయాలని,అలానే పొగాకు బేరం కు రూ.5 లక్షల ఇస్తున్నారని దానిని కూడా రూ.7 లక్షల వరకు పెంచి రైతులకు అండగా నిలవాలని రైతు సంఘం నాయకులు డీజీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులు తెలిపిన పలు విషయాలను సావధానంగా విన్న డీ జీ ఎం మాట్లాడుతూ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని బ్యాంక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని, మా పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి మిగిలిన సమస్యలపై అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి అతి త్వరలోనే మీరు అనుకున్నట్లుగా వ్యవసాయానికి పంట రుణాలను అందించే ఏర్పాటు చేస్తామన్నారు.రైతు సోదరులు కూడా బ్యాంకు అందించే అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా నిలబడుతూ బ్యాంకుకు కూడా సరైన సమయంలో అప్పు తీర్చేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆలపాటి రామ్మోహన్ రావు సుంకవల్లి వీరభద్రరావు,కొక్కెరపాటి పుల్లయ్య,వేముల సూర్య ప్రకాష్ రావు,మొగళ్ళపు చెన్నకేశవరావు,కాసాని చంద్రమోహన్,వైస్ ఎంపీపీ ఫణీంద్ర, తాడేపల్లి రవి, బ్యాంకు సిబ్బంది మురళీకృష్ణ, శ్రీధర్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Spread the love