Monday, September 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమార్కెట్ సంస్కరణలకు క్యూబా శ్రీకారం

మార్కెట్ సంస్కరణలకు క్యూబా శ్రీకారం

- Advertisement -

హవానా : అమెరికా ఆంక్షల కారణంగా కుదేలవు తున్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి క్యూబా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇరవై మూడు కీలక రంగాలకు సంబంధించిన 176 మార్కెట్ సరళీకరణ చర్యల సమగ్ర జాబితాకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ అధీనంలోని గ్రాన్మా వార్తా పత్రిక అందించిన వివరాల ప్రకారం…ఈ చర్యలను క్యూబా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై వీటిని ధృవీకరించింది. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్- కానెల్ గత వారం ఈ సంస్కరణలను గురించి తొలిసారిగా ప్రస్తావించారు. ఇంధనం, వ్యవసాయం, విదేశీ వాణిజ్యం సహా ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలనూ ఈ సంస్కరణలు ప్రభావితం చేస్తాయి. క్యూబా తలపెట్టిన మార్కెట్ సంస్కరణలపై అమెరికా ఇంకా స్పందించలేదు. క్యూబా ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని మాత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ‘వారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటే వారితో మాకు చాలా మెరుగైన సంబంధాలు ఉంటాయి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -