Sunday, August 30, 2026
E-PAPER
Homeఖమ్మంమంచినీటి కోసం దళిత కాలనీ వాసుల రాస్తారోకో

మంచినీటి కోసం దళిత కాలనీ వాసుల రాస్తారోకో

- Advertisement -

– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంఘీభావం
నవతెలంగాణ – అశ్వారావుపేట

దమ్మపేట మండలం మొద్దులగూడెం హరిజనవాడలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు ఆదివారం అశ్వారావుపేట – సత్తుపల్లి ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

రాస్తారోకోకు సీపీఐ(ఎం) దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొద్దులగూడెం దళితవాడలో గ్రామపంచాయతీకి చెందిన మంచినీటి మోటారు సుమారు 30 రోజులుగా పనిచేయడం లేదన్నారు. దీంతో రోజువారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 200 కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన దళితవాడలో కొత్త బోరు వేయించి, కొత్త విద్యుత్ మోటారు ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట కాలనీ ప్రజలతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళితవాడ ప్రజలతో పాటు గ్రామ ప్రజలు ఎం. సీతయ్య, ఎం. మల్లేశ్వరరావు, కె. రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -