విద్యుత్ షాక్ తగిలి దళిత రైతు దుర్మరణం

-నర్సాపూర్(పిఏ) లో విషాదం.. 
నవతెలంగాణ -తాడ్వాయి :
విద్యుత్ షాక్ తో ఓ దళిత రైతు దుర్మరణం పాలైన ఘటన తాడ్వాయి మండల పరిధిలోని నర్సాపూర్(పిఏ) గ్రామంలో ఎస్సీ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్(పిఏ) గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన సునారికాని సారయ్య (45) అనే దళిత రైతు వర్షాలు లేక వరి నారు మడి ఎండిపోతుడడంతో నీరు పెట్టడానికి కట్టు వాగు వద్ద ఉన్న పొలం వద్దకు, తన చిన్న కొడుకు వెంకటేశ్వర్లు తో కలిసి ఇద్దరూ వెళ్లారు. నర్సాపూర్ కట్టు వాగులో ఉన్న మోటారు వద్దకు చేరుకొని పైపులైన్లు సరిచేసుకొని తిరిగి ఇద్దరూ ఇంటికి వచ్చారు. చిన్న కొడుకు వెంకటేశ్వర్లు ఎడ్లను మేపడానికి అడవికి వెళ్ళాడు. తండ్రి (మృతుడు) సారయ్య ఒక్కడే సుమారు రెండు గంటల ప్రాంతంలో రెండు కరెంటు ఫీజులు కొనుక్కొని మోటార్ వద్ద కు వెళ్లి, పేడ కలిపిన నీటిని మోటర్ లో పోయడానికి వెళ్లాడు. అదే క్రమంలో దురదృష్టవశాత్తు మోటరు బాడికి ఎర్త్ అయి కరెంటు రావడంతో, అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం ఎవరు గమనించలేదు. సాయంత్రం కొడుకు వెంకటేశ్వర్లు తండ్రి ఎటు పోయిండు అని, అటు ఇటు ఊర్లోకి తిరిగి మోటర్ వద్దకు వెళ్లి చూశాడు. అది చూసిన చిన్న కుమారుడు వెంకటేష్ బోరున విలపించి, వారి బంధువులకు వారి చిన్నమ్మకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో దళిత కాలనీ శోకసముద్రంలో మునిగిపోయింది. పంచినామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏటూర్ నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ వారి చిన్న భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా సారయ్య పెద్ద భార్య గత 20 సంవత్సరాల క్రితం వ్యవసాయ పనుల నిర్వహిస్తుండగా తేలు కరిసి మృతి చెందింది. మృతుడు సారయ్య ఎల్లమ్మ ను రెండో వివాహం చేసుకొని సహా జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం వృత్తి చేసుకుంటూ ఆ పనుల్లోనే పెండ్లి భార్య మంగమ్మ(పెద్ద భార్య), గతంలో మృతి చెందడం, సారయ్య మోటార్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందడం,  ఇద్దరు మృతి చెందడంతో కాలనీవాసులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుడు సారయ్యకు చిన్న భార్య ఎల్లమ్మ, ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. సారయ్య ది పేద దళిత కుటుంబం కాబట్టి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వివిధ దళిత సంఘాలు, గ్రామస్తులు కోరుతున్నారు.
Spread the love