బిసి కులాల ఫెడరేషన్ లకు నిధులు మంజూరు చేయాలి: దండి వెంకట్

– బిసి కులాల ఫెడరేషన్ లకు  నిధులు మంజూరు చేయాలని కోరుతూ బిఎల్ఎఫ్ ఆధ్యర్యంలో ఆందోళనలు బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ – దండి వెంకట్ 
నవతెలంగాణ- తాడ్వాయి 
బిసి కులాల ఫెడరేషన్ లైన రజక, విశ్వకర్మ,మేదారి, వడ్డెర, కుమ్మరి,గౌడ, నాయి బ్రాహ్మణ, సంచార జాతులు తదితర బిసి కులాల ఫెడరేషన్ ల కు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 50% శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేసే వారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ తెలిపారు.
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిఎల్ఎఫ్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దండి వెంకట్ మాట్లాడుతూ.. కేసిఆర్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా  బిసి కులాల ఫెడరేషన్ లకు నిధులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. గత సంవత్సరం కొన్ని బిసి(ఎ) సంచార జాతులకు వ్యక్తిగతంగా 50 వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి కొంతమందికి మాత్రం ఇచ్చిన మిగిలిన వారికి మొండి చేయి చూపించారని ఆరోపించారు.
బిసి కులాల ఫెడరేషన్ లకు నిధులు మంజూరు చేయాలని, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూం కోసం ఉద్యమించాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, బిఎల్ ఎఫ్ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు, బహుజన మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, కామారెడ్డి జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ,బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటి సభ్యులు ఎం.అంజనేయులు, బహుజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగమణి, సహా య కార్యదర్శి స్వప్న, జిల్లా కోషదికారి, మల, బారతి, స్వామి, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love