డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీదర్ బాబు లకు దండు రమేష్ ఘన సన్మానం

– తాడిచెర్ల డేంజర్ జోన్ సమస్యపై వినతి
నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హాదాలో మొదటి సారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కాటారం మండలంలోని దుద్దిళ్ల స్వగ్రామం ధన్వాడకు విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సందర్భంగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ చైర్మన్ దండు రమేష్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల జెన్కో ఉపరితల బొగ్గుగని డేంజర్ జోన్ ప్రాంతంలోని నివాస గృహాలు,బ్లాస్టింగ్ దెబ్బలతో కూలి పోయిన నివాస గృహాల ఫోటోలు వారికి చూపించి,డేంజర్ జోన్  సమస్యపై వివరించినట్లుగా రమేష్ తెలిపారు.త్వరగా డేంజర్ జోన్ సమస్య పరిష్కరానికి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు.ఇందుకు బట్టి,దుద్దిళ్ల సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు.
Spread the love