Sunday, September 20, 2026
E-PAPER
Homeక్రైమ్ట్రావెల్‌ బ్యాగ్‌లో మృతదేహం కలకలం

ట్రావెల్‌ బ్యాగ్‌లో మృతదేహం కలకలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్ లోని బాచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రహరీ గోడను పక్కన ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఓ సూట్‌ కేసు పడి ఉండటం.. దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసు తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు మెరూన్‌ కలర్‌ చుడీదార్‌ ధరించి ఉన్నారు. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -