
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని అహ్మదుపుర కాలనీకి చెందిన షేక్ రఫత్ (45) తన ఇంటి వద్దనే మామిడి కాయలు కోసే కత్తితో పొడుచుకొని మంగళవారం ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. లేబర్ పని చేసే రఫత్ గతంలో పలు వివాదాల్లో తలదూర్చినట్టు తెలిసింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.