
– వ్యవసాయ కార్మిక సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ
నవతెలంగాణ – తుర్కపల్లి
పూట కొక్క పార్టీలు మార్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించి ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి యండి. జహంగీర్ గెలిపించాలని మహిళా రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ గారు పిలుపునిచ్చారు. సోమవారం రోజున తుర్కపల్లి మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత పది సంవత్సరాల మోడీ బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబాటు గురైందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మొదలుకొని అన్ని రంగాలను బీజేపీ సమూలంగా మార్చి తన మతోన్మాద మనువాద ఎజెండాను అమలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాలను మార్చి పనిభారాలను పెంచిందని, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు తన అన్యాయులైన అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి నల్ల చట్టాలు తెస్తే దేశవ్యాప్తంగా రైతాంగము వారి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటుతో వెనుక కొట్టిన పరిస్థితి ఉన్నదని అన్నారు. ఇప్పటికే కీలక రంగాలైన రైల్వే ఎల్ఐసి పోస్టల్ టెలికం సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానించి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ ఆలోచన చేస్తుందని విమర్శించారు. మరోపక్క విపరీతమైన ధరలు పెంచి సామాన్య మానవులు నిత్యవసర వస్తువులను కొనితిని పరిస్థితుల్లో లేకుండా పోయిందని అన్నారు. విద్య వైద్యం ఉపాధి సంక్షేమం లాంటి విషయాలలో బీజేపీ 10 సంవత్సరాల పాలనలో ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ మరో మారు గెలిస్తే ఈ దేశంలో కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు బతికే పరిస్థితి ఉండదని, రాజ్యాంగం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం హరించబడతాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించి సీపీఐ(ఎం) ను ఈ పార్లమెంటులో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనియాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య మండల కమిటీ సభ్యులు దేవరకొండ రాజు కడియాల నాగులు తూటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.