– మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలకు 33శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 29న ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు చెప్పారు. మహిళా కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపుమేరకు రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో ఢిల్లీకి తరలిరావాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళ కాంగ్రెస్ నుంచి ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదనీ, ఈసారి తమకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ‘పార్టీ కోసం పని చేశాం… మేమెందుకు పదవులు అడగొద్దు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.