అభివృద్ధియే ధ్యేయంగా

నవతెలంగాణ-రేవల్లి : రేవల్లి మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నేత శివరాం రెడ్డి గారు అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు. మండలానికి చెందిన ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్ తో సౌమ్యంగా మృదు మధురంగా మాట్లాడుతూ, తన గ్రామానికి కావలసిన ప్రతి పనిని కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటూ పనులు చేస్తున్నారు. స్వయంగా తను రేవల్లి గ్రామ సర్పంచ్ గారైనటువంటి గౌతమి శివరాంరెడ్డి భర్త అయినప్పటికీ ” ఆ గర్వం ఆ దర్పం ” ఏనాడు ఎవరి ముందు చూపించకుండా అందరిలో ఒకడిలా ఒక సామాన్యుడిలా ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్ననలను మనసులను చూరగొని ముందుకు సాగుతున్నారు. రేవల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీలో ఒకరిగా నేతల సంఖ్యలో మచ్చలేని చంద్రుడిగా నిలిచిపోయారని, అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ గా మారిన శివరాం రెడ్డిని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజల కోసం తను ఇదేవిధంగా ఇకముందు కూడా అన్ని విధాలుగా సహాయకారిగా ఉండాలని మనసారా కోరుకుంటున్న రేవల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love