నవతెలంగాణ – భిక్కనూర్: కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని భిక్కనూరు మండలం కంచర్ల గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి తెలిపారు. గురువారం గ్రామంలో మాల పోచమ్మ ఆలయం వద్ద ప్రభుత్వ విప్ సహకారంతో వేసిన బోరులో మోటార్ ను బిగించడం జరిగిందని, గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రమేష్, మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.