అభివృద్ధి ప్రదాత మంత్రి పొన్నం

నవతెలంగాణ-అక్కన్నపేట
మండలంలోని జనగామ, అంతకపేట, చౌటపల్లి గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కన్నపేట మండల అభివృద్ధి కోసం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. పొన్నం అభివద్ధి ప్రదాత అని కొనియాడారు. కాంగ్రెస్‌ అంటే మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, మండలానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ డీఈ శ్రీనివాస్‌ రెడ్డి, ఏఈ స్నేహ, వర్క్‌ ఇన్స్‌ స్పెక్టర్‌ రాజ్‌ కుమార్‌, కార్యదర్శులు వెంకటేశ్వర్‌, బోడ రాజు, జమున, హుస్నాబాద్‌ సింగల్‌ విండో వైస్‌ ఛైర్మెన్‌ ఎగ్గిడి ఐలయ్య, అంతకపేట, జనగాం ఎంపిటిసిలు కంది రజితశ్రీనివాస్‌, ఒద్దిరాల రవి, అంతకపేట, జనగాం గ్రామశాఖ అధ్యక్షులు కాశబోయిన రవి, వల్లపు పర్శరాములు, బైతి బీరయ్య, బండి శ్రీను, పత్తిపాక త్రిమూర్తి, పులికశి రమేష్‌, కుక్కల సంపత్‌, ఆవుల వెంకట్రాజం, మంద రఘు, సాలెండ్రా రాజు, మేడబోయిన శ్రీనివాస్‌, రవి పాల్గొన్నారు.

Spread the love