గ్రామాలలో ఆభివృద్ది పనులు నిరంతర ప్రక్రీయ లాంటింది

– జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జీపీ గ్రామాలలో ఆభివృద్ది పనుల నిరంతర ప్రక్రియ లాంటీదని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. మంగళ వారం నాడు మండలంలోని కంఠాలీ, చిన్న గుల్లా, పెద్ద గుల్లా, గుల్లా తాండా, పెద్ద ఎడ్గి గ్రామాలలో ఆభివృద్ది పనులను పరీశీలించారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతు ఉపాదీ హమీ పనుల వేగవంతం చేయాలని, కూలీల సంఖ్య పెంచి వారికి పని పూర్తీ చేస్తే నిర్దేశించిన కూలీ మెుత్తం వస్తుందని, ఉదయం తొందరగా రావాలని, ఎండలు ఎక్కువైనాయని , త్రాగునీరు వెంట తెచ్చుకోవాలని, చిన్న పిల్లలకు తీసుకొని రావద్దని కూలీలలకు సూచించారు. ఇవే కాకా గ్రామాలలో మురికి కాలువలను ఎప్పడి కప్పుడు శుభ్రం చేయాలని, నీటీ ఎద్దడి రాకుండా ముందస్తుగా సమస్య  గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేసి పరిష్కరించాలని ఆయా గ్రామాల జీపీ కార్యదర్శులకు ఆదేశించారు. ఎంపిడివో వెంట చిన్నగుల్లా కార్యదర్శి నాగయ్య తదితరులు ఉన్నారు.

Spread the love