లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేయాలి..కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి గత 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్లకు స్థలాలు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జిల్లా  అదనపు  కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఏషాల అశోక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సర్వేనెంబర్ 118 2.88 సెంట్ల భూమి బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఖాళీగా ఉన్నదని ఇట్టి భూమి రైతు నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిందని , బలహీన వర్గాలకు ఇంటి నివేషణ స్థలాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని దానిని అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని ఏశాల అశోక్ అన్నారు . పట్టాలు పొందిన ప్రతి వ్యక్తికి స్థలాలు కేటాయింపు చేసి ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొత్త ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య  జిల్లా అధ్యక్షురాలు సోమన సబిత సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య 11 వ వార్డు సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి చింతల పెంటయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మరి పెళ్లి రాములు, నాయకులు షర్బుద్దీన్, దొడ్డి బాలయ్య, కూరం పోషాలు, పర్వతం బాలకృష్ణ, కడారి అండాలు, చిలుకూరి భారతమ్మ, చింతల అమృత, దాసరి విజయ లు పాల్గొన్నారు.
Spread the love