వంట కార్మికులకు గౌరవ వేతనం ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
 మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి , జిల్లా కలెక్టర్ జెండగే హనుమంత్ కొండిబాకి, జిల్లా ఉద్యాశాఖధికారి నారాయణ రెడ్డి లకు వేరు వేరుగా వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  మేనిఫెస్టో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని దానిని వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని,  కార్మికులను తొలగించరాదని,  ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, వయసు పై బడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అదేవిధంగా స్లాబ్ రేటు పెంచుతూ నిత్యవసర వస్తువులన్నిటిని కూడా సరఫరా చేస్తూ పిల్లలకు పౌష్టికాహారం కింద కోడి గుడ్డను కూడా సరఫరా చేయాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సంధ్య, నిర్మల, పద్మ, లక్ష్మీ, అనసూర్య, వాణి, అండాలు, కృష్ణవేణి, సుగుణ లు  పాల్గొన్నారు.
Spread the love