
స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కొరకు 21న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపటంలో విఫలమైనాయని స్థానికంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా అనేకమంది ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడ్డారని నేటి ప్రభుత్వాలు కూడా పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వటంలో చిత్తశుద్ధిని ప్రదర్శించకపోవడం మూలంగా అద్దె ఇండ్లలో ఉంటున్న పేదలు కిరాయిలు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి తగ్గి పని దినాలు లేక పేదలు ఆర్థికంగా చితికి చితికి పోతున్నారు. ఉపాధి అవకాశాలను పెంచటం లో ప్రభుత్వాలు వెనుకబడుతున్నాయని మురికివాడలలో గ్రామీణ ప్రాంతాలలో బలహీన వర్గాలు నివసించే కాలనీలలో మురికి కాలువలు, రోడ్లు, తాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు ఉన్నారని అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీ అమలు జరపటం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలు తగ్గి పేదలకు ఇబ్బందులు పడుతున్నారని పట్టణాల్లో ఉపాధి హామీని అమలు జరపాలని ఉచిత బస్సు ప్రయాణమూలంగా కోల్పోతున్న ముక్కులను ఆదుకోవాలని, గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో కాలపై వారు చేస్తున్న దురాగతాలను అరికట్టటానికి వాటిని నిషేధించాలని కోరుతూ ఈనెల 21న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించిందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.