ధోనీ అభిమాని ఆత్మహత్య..

నవతెలంగాణ – హైదరాబాద్: తన ఇంటికి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కలర్స్‌ వేసి, గోడలను క్రికెటర్ల బొమ్మలతో నింపేసి ధోనీపై అభిమానాన్ని చాటుకున్న చెన్నైకి చెందిన ఆయన వీరాభిమాని గోపీ కృష్ణన్ (34) అదే ఇంట్లో నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లాలోని అరంగూర్‌లోని తన ఇంట్లో తెల్లవారుజామున 4.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పొరుగు ఊర్లోని కొందరితో తన సోదరుడికి ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయని గోపీ సోదరుడు రామ్ తెలిపారు. ఇటీవల వారితో జరిగిన గొడవలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అతడి ఆత్మహత్యకు ఇదే కారణం అయి ఉంటుందని భావిస్తున్నట్టు వివరించారు. అసహజ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అప్పట్లో గోపీకృష్ణన్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ తిరిగింది.

Spread the love