Thursday, April 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలు

ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చలు

- Advertisement -

లెబనాన్‌ సంసిద్ధత
బీరుట్‌ :
ప్రత్యక్ష చర్చల ద్వారా ఇజ్రాయిల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు లెబనాన్‌ సంసిద్ధత వ్యక్తపరచింది. లెబనాన్‌ విదేశాంగ మంత్రి యూసఫ్‌ రజ్జీ సోమవారం అల్‌ జజీరా వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ భాగం కాదని, దానిపై దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయిల్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా దక్షిణ లెబనాన్‌లోని నబాతై అల్‌-ఫాఖా పట్టణంపై ఇజ్రాయిల్‌ సేనలు దాడులు చేశాయి. మరోవైపు లెబనాన్‌ నుంచి హెజ్బొల్లాలు దాడులు చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయిల్‌లోని గలీలీలో సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. స్లోమీ సెటిల్మెంట్‌లోని ఇజ్రాయిల్‌ సైనికులను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌ దాడి చేశానని హెజ్బొల్లా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -