యువకుడి అదృశ్యం

– ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన యువకుడు తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదైంది.
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన యువకుడు తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదైంది. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.పెద్దకొడప్ గల్ గ్రామానికి చెందిన బత్తిని హరికుమార్ బిచ్కుందా ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బయటకు వెళ్ళి వస్తానని TS17K2776 నంబరు గల ద్విచక్ర వాహనంపై జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయలు దేరి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర చోట్ల వెతికిన ఆచూకి లభించలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళే సమయంలో నీలి, పసుపు రంగు కలిగిన చొక్కను, నీలి రంగు జీను ప్యాంటును ధరించాడని తెలిపారు. యువకుడి తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోనారెడ్డి పేర్కొన్నారు.
Spread the love