రాయితీపై జిలక విత్తనాలు పంపిణీ

నవతెలంగాణ – మోర్తాడ్

మోర్తాడ్ సహకార సంఘం ఆధ్వర్యంలో రాయితీపై రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని లావణ్య బుధవారం తెలిపారు. 30 కేజీల బస్తా 60 శాతం రాయితీపై 1116 రూపాయలకు రైతులకు అందిస్తున్నామని ఆసక్తిగల రైతులు ఆధార్ కార్డు పాస్ బుక్ లో జిలుగ విత్తనాలను తీసుకెళ్లాలని అన్నారు. జీలుగా సాగవలన భౌతిక స్థితి మెరుగుపడి నేల కు నీటిని పోషకాలను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందని, పచ్చ రొట్ట జీలుగా పైరును పూత దశలో కలియ దున్నడం వలన భూ సాంద్రత పెరుగుతుందని అన్నారు. ఒక ఎకరానికి 12 నుండి 15 కిలోల జీలుగు విత్తనాలు అవసరం ఉంటుందని ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి కాశీరాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love