పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ..

– వినూత్నంగా మనవడి పుట్టిన రోజు వేడుకలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పారిశుధ్యం కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి మనవడి పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించిన ఉపాద్యాయ దంపతులు సమాజం పట్ల వారికున్న విజ్ఞతను చాటుకున్నారు. గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచటం లో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు ఏమిచ్చినా తక్కువేనని అటువంటి పారిశుధ్యం కార్మికులకు ప్రతి ఒక్కరూ చేయూత గా నిలవాలని స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సి.హెచ్.వి శుభ వాణి అన్నారు. సోమవారం తన మనుమడు యశ్విక్ రామ్ పుట్టిన రోజు పురస్కరించుకుని 25 మంది కార్మికులకు దుస్తులు,మిఠాయిలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రమణ్యం,సిహెచ్ నర్సింహరావు తదితరులు ఉన్నారు.
Spread the love