వృద్ధులకు, వితంతులకు చీరలు దుప్పట్లు పంపిణి

– గ్రీస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామంలో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాటాపూర్ సర్పంచ్ పుల్లురి గౌరమ్మ చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు. పేద ప్రజలకు గ్రీస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి సేవ అయినా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఈ విధంగా పంపిణీ చేసిన సంస్థ సభ్యులను గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌశెట్టివాయి సర్పంచ్ వంట్ట సావిత్రి బాలరాజు, టైగర్ కంతి  ముత్తయ్య, ముర్రం రాజేష్, కంతి లక్ష్మణ రావు, పోడెం నారాయణ, రాంబాబు, వట్టం బాలరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love