Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
వ్యవసాయ శాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్ధం పెసలు, కందులు, మినుములు, ఉలువలు, అలసంద విత్తనాలను అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యన్మంగండ్ల రైతు వేదికల్లో వివిధ రకాల చిరుధాన్యాలు, విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపి విత్తనాలు మేలైన దిగుబడులు ఇస్తాయని చెప్పారు. ఎల్ నినో ప్రభావం తట్టుకుని పండే పంటలు పండించాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, ఏఈఓ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -