క్రీడ దుస్తులు పంపిణీ

నవతెలంగాణ – చిన్నకోడూరు

నేను ఎక్కువగా చదువుకోకపోయినా చదువుకున్న వాళ్ళని చూసి స్ఫూర్తిని పొంది మా గ్రామ విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఆకాంక్షతో విధ్యార్థులకు క్రీడ దుస్తులు అందజేస్తున్నట్లు దుస్తుల దాత ఏలేటి రాజారెడ్డి తెలిపారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ రూ.25 వేల రూపాయలు విలువగల క్రీడా దుస్తులను సోమవారం విద్యార్థులకు అందజేశారు. క్రీడా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల బాబు, మాజీ ఉపసర్పంచ్ పున్నం సురేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఏదుల్ల రాములు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Spread the love