విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ…

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో వళ్లెంకుంట గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలు రాయడానికి బుధవారం  అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్,పెన్నులు,కంపాక్స్ లు పంపిణీ చేశారు.యూత్ పరీక్ష ప్యాడ్స్ పంపిణీపై ప్రాధానోపాధ్యాయుదుతోపాటు పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు ఎస్.రాజబాబు,కోశాధికారి ఎం.సంజీవ్, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రవి,ముత్తయ్య,కిరణ్,రమేష్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love