బస్వాపూర్ ఎంపీయూపీఎస్ లో ఏకరూప దుస్తుల పంపిణీ..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని బస్వాపూర్ గ్రామములోని ఎంపియూపీఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను  ప్రదాన ఉపాద్యాయుడు జయచంద్ శనివారం నాడు సాయంత్రం గ్రామస్తులు పాఠశాలలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో  పంపిణి చేయడం జర్గింది . ఈ సంధర్భంగా హెచ్ఎం జయచంద్ మాట్లాడుతూ.. యూనీఫాం లు ధరించడం వలన పాఠశాలలో సమన్యాయం జర్గుకుంది. పేద, ధనవంతులైన సమానంగా చూడగలుగుతామని, విద్యార్థులకు ఏకరూప దుస్తుల వలన నానసీక ఉల్లాసంతో పాటు క్రమ  శిక్షణగా ఉంటుందని పేర్కోన్నారు. పాఠశాలలో ప్రస్తుతం తొంబై మంది విద్యార్థిని విద్యార్థులు విద్యనబ్యసిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయ బృందం. గ్రామస్తులు పాల్గోన్నారు.
Spread the love