
గాందారి మండల కేంద్రంలోని హారలే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఆక్వా రాజధాని దిశగా చేపల పెంపకము మరియు గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీలు వివోఏలకు ఉగాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ సంస్థ ద్వారా రుణాలు తీసుకుని యూనిట్ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పథంలో ప్రయాణించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గాంధారి మేనేజర్ వేణు ఉట్నూర్ మేనేజర్ అశోక్ రెడ్డి , లింగంపేట్ మేనేజర్ అరుముగం, మండల సమఖ్య అద్యక్షురాళ్ళు పుష్ప రాణి, శోభ .సులోచన , ఆక్వా ఉదయ్ గాంధారి ఏపిఎం గంగరాజు లింగంపేట్ సదాశినగర్ ఏపిఎంలో సీసీలు తదితరులు పాల్గొన్నారు.