ప్రజా పిర్యాదులలో జాప్యం జరుగకుండా తక్షణమే స్పందించాలి : జిల్లా ఎస్పీ

నవతెలంగాణ -పెద్దవూర : ప్రజా పిర్యాదులలో జాప్యం జరుగకుండా తక్షణమే స్పసందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. శుక్రవారం పెద్దవూర పోలీస్ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును, పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని,గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.ఈ యన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సాగర్ సీఐ బీసన్న, పెద్దవూర ఎస్ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Spread the love