డిచ్ పల్లి లో ఘనంగా ముగ్గుల పోటీలు…

నవతెలంగాణ- డిచ్ పల్లి
మండల కేంద్రం లోని ఆర్టీసీ బస్టాండ్ కు అనుకుని ఉన్న ప్రసిద్దిచెందిన శ్రీ కాశీవిశ్వనాథ ఆలయంలో శుక్రవారం మహిళలకు, యువతులకు, పిల్లలకు డిచ్ పల్లి మండల కేంద్రంలోని తిరుమల ఏజెన్సీ ఆధ్వర్యంలో రంగోళి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహకులు సంపత్ కుమార్, లక్ష్మన్, సునీల్ మాట్లాడుతూ ప్రతిఏటా డిచ్ పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన గంగామణీ (ప్రథమ), సంధ్యారాణీ ( ద్వితీయ), విదిషా( తృతియ)లకు నిర్వహకులు బహుమతులను అందించారు.
Spread the love