నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినా విషయం తెలిసిందే. ఈక్రమంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా బ్లాక్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకే, కాంగ్రెస్ కలిసి ప్రచారం చేశాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదు స్థానాల్లో గెలిచిన హస్తం అభ్యర్థులు.. విజయ్ అభ్యర్థన మేరకు టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ బాటలోనే వామపక్షాలు టీవీకేకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు లైన్ క్లీయర్ అయింది. టీవీకే 108, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఐ(ఎం) 2, వీసీకే 2 సీట్లలతో విజయ్ బలం మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది.
కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు కట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



