గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఆపొద్దు..

– ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో  20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని,తడపాకల్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ లను శుక్రవారం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ప్రజలకోసం మంజూరైన వివిధ పనులను ప్రస్తుత ప్రభుత్వం ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డికి, ఆయా శాఖ మంత్రులకు,నాయకులకు విన్నవించుకుంటున్నానని ఆ పనులన్నీ నాకోసం కాదని ప్రజల కోసం అని అన్నారు.అలాగే మంజూరైన పనులను రద్దుచేయవద్దని స్థానిక నాయకులు అది నాయకత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు.గృహాలక్ష్మి కింద పేద ప్రజలకోసం మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను రద్దుచేయవద్దని, ఒక వేళ రద్దు చేస్తే మీ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఇప్పుడు మంజూరైన వారికే ఇంటి ఆర్థిక సహాయం కోసం 5 లక్షల రుణం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు నాలుగు గ్రామాలకు ఒక ఆసుపత్రి ఉండాలనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గం మొత్తంగా పేద ప్రజల వైద్యం కోసం 17 హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పూర్ణానందం, సర్పంచ్లు పత్తిరెడ్డి ప్రకాష్,మంజుల బాలాజీ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love