
– వైఎస్సార్ ఆశయానికి తూట్లు
నవలంగాణ – మల్హర్ రావు.
చిన్న నీటి వనరులను రక్షించాలనే ఉద్దేశ్యంతో 1975లో మండలంలోని ఉమ్మడి పెద తూండ్ల గ్రామ పంచాయతీ సమీపంలోని తీగల వాగుకు అడ్డంగా ఆనకట్టను రూ.13 లక్షల వ్యయంతో నిర్మించారు. కానీ 1978లో ఆనకట్టకు గండి పడ డంతో ప్రాజెక్టులో నీరు నిలువలేదు. 1986లో కురిసిన భారీ వర్షాలకు కోట్టుకుపోయింది. అప్పట్టి నుంచి ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు ఇరువై ఏళ్ల అనంతరం 2002లో రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జలయజ్ఞం కార్యక్రమం చేపట్టడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దివగంత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి స్థానిక నాయకులు ప్రస్థావన తీసుకువచ్చారు. అనంతరం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు చొర వతో 2006లో ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.3.74కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు 456 జీఓను జారీ చేశారు.దీంతో టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనులతిగలవాగు ప్రాజెక్టుకు మోక్షం కలిగేనా.!? నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో రెండు నెలల కాలంలోనే కురిసిన భారీ వర్షానికి మరోసారి ఆనకట్టకు భారీ గండి పడింది. ప్రాజెక్ట్ పనులు పూర్తికాకుండానే గండి పడటంతో తమ తప్పును సమర్ధించుకునేందుకు అధికారులు తప్పంతా కాంట్రాక్టర్పై నెట్టారు. కోట్లా రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనీతీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆశాఖ అధికారులపై ఉందనే విషయాన్ని మరిచిపోవడాన్ని రైతులు తీవ్రంగా ఆ విమర్శించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు తీగల వాగును అనుసాందనం చేస్తే మరమ్మతు పనులు జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు తెలుపు తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దీని కింద 1029 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది.
ముంపు బాధితులకు పరిహారం..
తిగలవాగు ప్రాజెక్టు గండి పడటంతో ప్రాజెక్టు కింద భూములు నష్టపోయిన ముంపు రైతులకు నష్టపరిహారం అందించారు.ప్రాజెక్టు కింద సుమారుగా 71 మంది రైతుల వద్ద నుంచి అధికారులు 84 ఎకరాల భూములను సేకరించి పరిహారం అందించారు.
పనులు ప్రారంవించాలి….ఆయకట్టు రైతులు .
తిగలవాగు ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది.ప్రాజెక్టు పూర్తియి అందుబాటులోకి వస్తే నీళ్లు వస్తాయి.రెండు పంటలు పండుతాయి.పనులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలి.
నివేదిక సమర్పించాం.. రంజిత్ ఇరిగేషన్…ఏఈ
పెదతూండ్ల తీగల వాగు ప్రాజెక్టు మరమ్మ తులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభు త్వానికి సమర్పించాం. మరోసారి పాత ప్రతిపాదనతో కలిపి నూతనంగా కూడా ప్రతిపాదనలు చేసి ఉన్నతాధికారులకు సమర్పించాం. అనుమతులు రాగానే పను లు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం