అదేపనిగా మింగేస్తున్నారా?

Do you swallow like that?రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, పెద్ద సంఖ్యలో మాత్రలు, విటమిన్ల టాబ్లెట్లను ఉపయోగించడం సర్వసాధారణమై పోయింది. అయితే విటమిన్‌ టాబ్లెట్లను అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో తగినంత విటమిన్లు ఉంటే ఇన్ఫెక్షన్‌లను రాకుండా నిలువరిస్తాయి. అయితే శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచడానికి టాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ వాడటం మాత్రం ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. ఎ ఒక నివేదిక ప్రకారం పెద్ద సంఖ్యలో విటమిన్లు వాడటం వల్ల కడుపులో చికాకు, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ ఎ సహాయపడుతుంది. అయితే ఒక పరిశోధన ప్రకారం, శరీరంలో విటమిన్‌ ఎ సంఖ్యను పెంచడానికి పెద్ద సంఖ్యలో విటమిన్‌ ఎ సప్లిమెంట్లను ఉపయోగించడం వల్ల కళ్ళకు నష్టం జరుగుతుంది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, విటమిన్‌ ఎ ను ఆహారం ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ శరీరంపై విటమిన్‌ ఇ ప్రభావంపై ఓ పరిశోధన చేసింది. ఈ పరిశోధన ప్రకారం విటమిన్‌ ఇ పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కంటి కాంతి తగ్గుతుందని తేలింది. అందుకే మనం విటమిన్‌లను పొందేందుకు తీసుకునే ఆహారం ద్వారానే ప్రయత్నించాలి.

Spread the love