- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 882 పాయింట్లు క్షీణించి 73,772 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 23,271 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50గా ఉంది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉండగా, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ షేర్లు నష్టపోతున్నాయి.
- Advertisement -



